శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జులై 31 నాటికి 5.9 కోట్ల ఐటిఆర్‌ల దాఖలు..

5 గంటల క్రితం

itr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మదింపు సంవత్సరం ​2026-27నకు సంబంధించి జులై 31 నాటికి దేశవ్యాప్తంగా 5.9 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటిఆర్‌) దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఐటిఆర్-1, ఐటిఆర్-2 దాఖలు చేయడానికి ఎలాంటి అదనపు రుసుము లేకుండా జులై 31ని తుది గడువుగా నిర్ణయించినట్లు తెలిపింది. గత మదింపు సంవత్సరంలో (2025-26) గడువు పొడిగించడం వల్ల సెప్టెంబర్ 16 నాటికి 7.3 కోట్లకు పైగా ఐటిఆర్‌లు దాఖలైనట్లు ఐటీ శాఖ పేర్కొంది. రూ. 50 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు, రెండు సొంతిళ్లు ఉన్నవారు ఐటిఆర్‌-1 దాఖలు చేయాల్సి ఉండగా.. అంతకంటే ఎక్కువ ఆస్తులు, మూలధన లాభాలు, విదేశీ ప్రయాణ ఖర్చులు ఉన్నవారు ఐటిఆర్‌-2 వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా రిటర్నులు సమర్పించని వారు ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు దాఖలు చేసే అవకాశం కల్పించామని పేర్కొంది. వార్షికాదాయం రూ. 5 లక్షల వరకు ఉన్నవారు రూ. 1,000, ఆ దాటిన వారు రూ. 5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఐటి శాఖ వెల్లడించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్