ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ప్రముఖ గ్లోబల్ హాస్పిటాలిటీ సంస్థ హిల్టన్, కపిల్ గ్రూప్‌కు చెందిన బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంగా హిల్టన్ గార్డెన్ ఇన్ విశాఖపట్నం యెండాడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. యెండాడలో కపిల్ గ్రూప్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న ప్రతిష్ఠాత్మక 10 ఎకరాల వరల్డ్ ట్రేడ్ సెంటర్ మిశ్రమ వినియోగ ప్రాజెక్టులో ఈ హోటల్ భాగంగా ఉంటుంది. హిల్టన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఏషియా రీజినల్ హెడ్ జుబిన్ సక్సేనా మాట్లాడుతూ, ‘రాష్ట్రవ్యాప్తంగా హిల్టన్ గార్డెన్ ఇన్ హోటళ్ల ఏర్పాటుకు మా ప్రణాళికలు కొనసాగుతున్నాయి. హాస్పిటాలిటీ గమ్యస్థానంగా విశాఖపట్నం దీర్ఘకాలిక అవకాశాలపై మాకు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు. హిల్టన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డెవలప్‌మెంట్ – ఆసియా పసిఫిక్ క్లారెన్స్ టాన్ మాట్లాడుతూ ‘భారతదేశంలో ప్రస్తుతం 11 హిల్టన్ గార్డెన్ ఇన్ హోటళ్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరో 13 హోటళ్లు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ (కపిల్ గ్రూప్) మేనేజింగ్ డైరెక్టర్ వడ్డనపు కృష్ణయ్య మాట్లాడుతూ, విశాఖపట్నంలో అభివృద్ధి చెందుతున్న వ్యాపార రంగానికి అనుగుణంగా, వ్యాపార, విశ్రాంతి ప్రయాణికులకు నాణ్యమైన హాస్పిటాలిటీ అనుభవాన్ని అందించాలన్న తమ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని అన్నారు.
విశాఖపట్నంలో‘హిల్టన్ గార్డెన్ ఇన్’ ఏర్పాటుకు ఒప్పందం
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)