శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఐ వల్ల మూడేళ్లలో మానవాళి అంతం

11 గంటల క్రితం

ai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తక్షణ నియంత్రణ అవసరం

- ఓపెన్ఎఐ సేఫ్టీ రీసెర్చర్ మార్కస్ హెచ్చరిక

వాషింగ్టన్‌ : దూసుకుపోతున్న కృతిమ మేధా (ఎఐ)తో మానవాళి మనుగడకే పెను ముప్పుగా మారుతోందంటూ టెక్ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో ఎఐ కారణంగా మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఏకంగా 70 శాతం ఉందని ప్రముఖ ఎఐ సంస్థ ఓపెన్ఎఐ సేఫ్టీ రీసెర్చర్ మార్కస్ విలియమ్స్ హెచ్చరించారు. ఎఐ టెక్నాలజీ నియంత్రణపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కఠినమైన నిబంధనలు తీసుకురావాలని లేదా ఎఐ ప్రయోగశాలలన్నీ కలిసి ఫ్రాంటియర్ ఎఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని ఆయన కోరారు. సరైన నియంత్రణ లేకపోతే వచ్చే కొద్ది సంవత్సరాలలో మానవ జాతి అంతరించిపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

ఇదే అభిప్రాయాన్ని అమెరికా ప్రభుత్వ మాజీ టెక్నాలజీ సలహాదారు, తాజాగా ఓపెన్ఎఐ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కమిటీలో చేరిన పాల్ క్రిస్టియానో కూడా సమర్థించారు. సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలపై సరైన అజమాయుషీ లేకపోతే ప్రపంచం వాటిపై నియంత్రణ కోల్పోతామన్నారు. దీనివల్ల అత్యధికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్ఎఐతో పాటు ఇతర ఎఐ సంస్థలు కూడా ఈ ముప్పును తగ్గించే దిశగా తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.​ ఇటీవల ఎఐ ఏజెంట్లు హగ్గింగ్ ఫేస్ సంస్థను హ్యాక్ చేయడానికి ప్రయత్నించడం, జర్మనీకి చెందిన ఒక వెబ్‌సైట్‌ను హైజాక్ చేయడం వంటి పరిణామాలు టెక్ నిపుణుల భయాలను మరింత పెంచుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్