న్యూఢిల్లీ : పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై బేస్ ఫేర్‌పై 10 శాతం తగ్గింపుతో పాటు.. సాధారణంగా అనుమతించే 15 కిలోల బ్యాగేజీకి అదనంగా మరో 10 కిలోలు తీసుకెళ్లే సదుపాయాన్ని కల్పించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా కేవలం రూ.99 చెల్లించి ప్రయాణ తేదీలను మార్చుకునే వెసులుబాటును కూడా అందించింది. అక్టోబర్ 20 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌ను పొందడానికి విద్యార్థులకు కనీసం 12 ఏళ్ల వయసు ఉండటంతో పాటు, ఫొటోతో కూడిన గుర్తింపు పొందిన విద్యాసంస్థ ఐడి కార్డు తప్పనిసరి అని సంస్థ వెల్లడించింది.
విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ డిస్కౌంట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)