బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబిఎండబ్ల్యులో 8,000 ఉద్యోగులకు ఉద్వాసన

1 గంట క్రితం

bmw
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 10:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ దిగ్గజం బిఎండబ్ల్యు పొదుపు చర్యల్లో భాగంగా వేలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేయ్యడానికి సిద్దమయ్యింది. జర్మనీలోని తమ సంస్థలో 2027 చివరినాటికి దాదాపు 8 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ వర్క్‌ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బిఎండబ్ల్యు తెలిపింది. ఈ ఉద్యోగ కోతలను స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్యాకేజీల ద్వారా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా బిఎండబ్ల్యు సంస్థలో సుమారు 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. తాజా నిర్ణయం ద్వారా డెస్క్‌ ఆధారిత పరిపాలనా విభాగం, ఆర్‌అండ్‌‌డి, ప్లానింగ్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది నష్టపోనున్నారు. ఉత్పత్తి రంగానికి చెందిన కార్మికులకు తొలగింపుల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ వచ్చే ఏడాది చివరి వరకు కొనసాగనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్