శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న బఫెట్

16 గంటల క్రితం

nes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 10:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సుదీర్ఘ 56 ఏళ్ల ప్రస్థానానికి తెర

వాషింగ్టన్‌ : ప్రపంచ దిగ్గజ పెట్టుబడిదారుడు, అపర కుబేరుడైన 96 ఏళ్ల వారెన్ బఫెట్ బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్ పదవి నుంచి ఎట్టకేలకు వైదొలిగారు. గత ఐదు దశాబ్దాలకు పైగా ఈ సంస్థకు నాయకత్వం వహించిన ఆయన.. తన 56 ఏళ్ల సుదీర్ఘ కాలపు ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ కంపెనీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఆయన స్థానంలో బెర్క్‌షైర్‌ హాత్‌వే కొత్త ఛైర్మన్‌గా ఆయన కుమారుడు హోవర్డ్ బఫెట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1993 నుంచి హోవర్డ్ బెర్క్‌షైర్‌ బోర్డు సభ్యుడిగా అనుభవం కలిగి ఉన్నారు. కంపెనీలో పూర్తిస్థాయిలో బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ వారెన్ బఫెట్ ఇకపై గౌరవ ఛైర్మన్‌గా కొనసాగడంతో పాటు బోర్డులో డైరెక్టర్‌గానూ తన సేవలను అందిస్తారని స్పష్టం చేసింది.

‘కాలమే ఎప్పుడూ గెలుస్తుంది. అయినప్పటికీ ఆ కాలం నా పట్ల కాస్త ఉదారత చూపించింది.’ అని వారెన్‌ ‌బఫెట్‌ ఈ సందర్భంగా వాటాదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 1970లో బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన వారెన్ బఫెట్ అప్పట్లో కేవలం ఒక సాధారణ వస్త్ర పరిశ్రమగా ఉన్న ఆ కంపెనీని బీమా రంగం వైపు మళ్లించారు. ఆ తర్వాత క్రమంగా టెక్స్‌టైల్స్, బీమా, రైల్‌రోడ్స్, కన్జ్యూమర్ బ్రాండ్లు, ఈక్విటీ రంగాల్లోకి మూలధనాన్ని విస్తరించి దానిని ఒక తిరుగులేని పెట్టుబడిదారి సామ్రాజ్యంగా మార్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్