ఐదో టి20లోనూ టీమిండియా చిత్తు సిరీస్ 4-0తో ఇంగ్లండ్ గెలుపు
సౌథాంప్టన్: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టి20లోనూ టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 258పరుగుల భారీ ఛేదనలో భాగంగా టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో గెలిచింది. ఛేదనలో భాగంగా ఇండియా బ్యాటర్లు ఇషాన్ కిషన్(56), తిలక్ వర్మ(53) అర్ధసెంచరీలకి తోడు శ్రేయస్(28), సంజు(27) బ్యాటింగ్‌లో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లు సామ్ కర్రన్‌కు మూడు, ఆర్చర్, టంగ్, డాసన్, రషీద్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. అంతకుముందు రికార్డు స్థాయిలో 7వ సారి టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానిం చాడు. బట్లర్(131; 64బంతుల్లో 12ఫోర్లు, 8సిక్సర్లు), కెప్టెన్ బ్రూక్(95నాటౌట్; 45బంతుల్లో 4ఫోర్లు, 8సిక్సర్లు) రాణించడంతో 3వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.








కామెంట్‌లు (0)