శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెనరా హెచ్‌ఎస్‌బిసి లైఫ్‌కు రూ.కోటి జరిమానా

11 గంటల క్రితం

hsbc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 09:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఐఆర్‌డిఎఐ నిబంధనలను ఉల్లంఘించి 88 ఏళ్ల వృద్ధుడికి డిఫర్డ్‌ యాన్యుటీ పాలసీ విక్రయించినందుకు కెనరా హెచ్‌ఎస్‌బిసి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి భారీ జరిమానా పడింది. ఈ అంశంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌‌డిఎఐ) రూ. కోటి జరిమానా విధించింది. కెనరా బ్యాంక్‌కు చెందిన 88 ఏళ్ల ఖాతాదారుడికి ‘స్మార్ట్ గ్యారెంటీడ్ పెన్షన్ 6’ ప్లాన్‌ను అండర్‌రైటింగ్, నిబంధనలకు విరుద్ధంగా అంటగట్టినట్లు తనిఖీల్లో తేలింది. ఈ పాలసీ ప్రకారం గరిష్ట ప్రవేశ వయస్సు 80 ఏళ్లు మాత్రమే ఉండాలనే నిబంధనను ఉల్లంఘించడంతో పాటు, ఇది తప్పుదారి పట్టించి విక్రయించిన కిందకు వస్తుందని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. వివాదం తర్వాత సంస్థ రూ.4.09 లక్షలను వెనక్కి ఇచ్చినా చేసిన ఉల్లంఘనలు తొలగిపోవని తేల్చిచెప్పింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్