గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చంద్రశేఖరన్ పునర్నియామకం సరైందే : టాటా సన్స్

1 గంట క్రితం

tata
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 09:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ​టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్ పునర్నియామకం బోర్డు మెజారిటీ తీర్మానం ద్వారా సరిగ్గా జరిగిందని ఆ సంస్థ మరోమారు పేర్కొంది. ఆయన నియామకాన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా లేవనెత్తిన అభ్యంతరాలను సంస్థ గురువారం తోసిపుచ్చింది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఎఒఎ)లోని ఆర్టికల్ 118 ప్రకారం కొత్త చైర్మన్ మొదటి నియామకానికి మాత్రమే ప్రత్యేక ప్రక్రియ వర్తిస్తుందని.. ప్రస్తుత చైర్మన్ పునర్నియామకానికి అది వర్తించదని టాటా సన్స్ స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులు ఉదయ్ లలిత్, బి.ఎన్. శ్రీకృష్ణ, సుదీప్తో సర్కార్‌ల న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్