శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసామాన్యుడిపై రుణభారం

6 గంటల క్రితం

సామాన్యుడిపై రుణభారం  
- ఆర్‌బిఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో వడ్డీ మోత
- పలు బ్యాంకుల ప్రకటన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 09:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆర్‌బిఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో వడ్డీ మోత

  • పలు బ్యాంకుల ప్రకటన

న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బిఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చడంతో రుణగ్రహీతలపై అదనపు భారం పడుతోంది. ఆర్‌‌బిఐ నిర్ణయంతో బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ సహా పలు బ్యాంకులు తమ రెపో ఆధారిత రుణ వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో కొత్తగా గృహ, వాహన రుణాలు తీసుకునేవారితో పాటు ఇప్పటికే రెపో ఆధారిత రుణాలు పొందినవారిపైనా ప్రభావం పడుతోంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ వడ్డీ రేటును 8.10 శాతం నుంచి 8.35 శాతానికి, ఇండియన్ బ్యాంక్ 7.95 శాతం నుంచి 8.20 శాతానికి పెంచాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ రేట్లను 8.10 శాతం నుంచి 8.35 శాతానికి సవరించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రేటును 8.15 శాతానికి పెంచింది. ఆర్‌బిఎల్ బ్యాంక్ రెపో లింక్డ్ రుణ వడ్డీ రేటు అక్టోబర్ 7 నాటికి 8.50 శాతంగా ఉంది. యూకో బ్యాంక్ అక్టోబర్ 8 నుంచి వివిధ బెంచ్‌మార్క్ రేట్లను సవరించింది. రెపో రేటుతో అనుసంధానమైన పాత రుణాలపై వడ్డీ రేట్లను సాధారణంగా 90 రోజుల్లోగా సవరించే అవకాశం ఉంది. అయితే ఈ పెంపు ప్రభావం రుణ ఒప్పందం, వడ్డీ రేటు రీసెట్‌ నిబంధనలు, మిగిలిన రుణ కాలవ్యవధిపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు డిపాజిట్‌ రేట్ల విషయంలో బ్యాంకులు తక్షణమే పెంపు చేపట్టకపోవచ్చని అంచనాలున్నాయి. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్