న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సిఇఒగా ప్రస్తుత సిఎఫ్‌ఒ దీపక్ రజావత్ నియమితులయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సంస్థ 2024-25లో రూ.5,822 కోట్లు, 2025-26లో రూ.6,767 కోట్ల నష్టాలను నమోదు చేసిన నేపథ్యంలో ఆయన నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం 108 విమానాలతో రోజుకు 585 సర్వీసులు నడుపుతున్న సంస్థను సాంకేతికత, ప్రయాణికుల సేవలకు ప్రాధాన్యమిచ్చే సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రజావత్ తెలిపారు.








కామెంట్‌లు (0)