హైదరాబాద్ : హైదరాబాద్ హైటెక్స్‌లో డిజైన్ డెమోక్రసీ నాలుగో ఎడిషన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు జరిగే ఈ ప్రదర్శనలో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, ఫర్నిచర్, కళారంగాలకు చెందిన 200కుపైగా బ్రాండ్లు, 150 మందికిపైగా నిపుణులు పాల్గొంటున్నారు. సుమారు 30 వేల మంది సందర్శకులు వస్తారని ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు పల్లికా శ్రీవాస్తవ్ అంచనా వేశారు. తెలంగాణ మ్యూజియం, సుస్థిరత గ్యాలరీతో పాటు డిజైన్ భవిష్యత్తుపై చర్చలు ప్రధాన ఆకర్షణలని తెలిపారు.
హైటెక్స్‌లో డిజైన్ డెమోక్రసీ సందడి
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 09:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)