శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రత్యక్ష పన్ను వసూళ్లు @ 12 లక్షల కోట్లు

16 గంటల క్రితం

tax
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 10:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఇప్పటి వరకు భారీ మొత్తంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. ముందస్తు పన్ను చెల్లింపులు మెరుగ్గా ఉండటంతో సెప్టెంబర్ 17 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 13 శాతం పెరిగి రూ. 12.12 లక్షల కోట్లకు చేరుకున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) శుక్రవారం వెల్లడించింది. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్లు 19.48 శాతం వృద్ధితో సుమారు రూ. 5.56 లక్షల కోట్లకు చేరగా.. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల నుంచి వచ్చే నాన్ కార్పొరేట్ పన్ను వసూళ్లు 6 శాతం పెరిగి రూ. 6.16 లక్షల కోట్లను దాటాయి. అలాగే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 17 మధ్య కాలంలో సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌ఐటి) వసూళ్లు ఏకంగా 53 శాతం ఎగబాకి రూ. 40,214 కోట్లకు చేరుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్