- హైదరాబాద్‌లో 26న ఆవిష్కరణ
ప్రజాశక్తి - హైదరాబాద్: గుండె జబ్బుల నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా చెక్ రిపబ్లిక్‌కు చెందిన హెల్త్‌టెక్ సంస్థ ‘కార్డి ఏఐ’ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత దీర్ఘకాలిక ఈసీజీ మానిటరింగ్ టెక్నాలజీ భారత్‌లోకి అందుబాటులోకి రానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూరేషియా మెడికల్ టెక్నాలజీస్ ప్రతినిధులు డా.రమణ జగర్లమూడి, డా.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 26న జరగనున్న కార్యక్రమంలో దీనిని అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. సాంప్రదాయ 24 గంటల హోల్టర్ మానిటరింగ్ పరిమితులను అధిగమించే ఈ వేర్‌బుల్ ఈసీజీ ఛెస్ట్ స్ట్రాప్, ఏఐ విశ్లేషణ ద్వారా రోగులు తమ దైనందిన జీవితాన్ని గడుపుతూనే గుండె స్పందనలను దీర్ఘకాలం పాటు పర్యవేక్షించవచ్చన్నారు. భారత ప్రభుత్వ ఎండీ-15 లైసెన్స్ పొందిన ఈ పరికరం దేశంలో కార్డియోవాస్క్యులర్ ఆరోగ్య సంరక్షణకు నూతన దిశనిస్తుందని వారు తెలిపారు.








కామెంట్‌లు (0)