సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సెమీస్‌‌కు ఇంగ్లాండ్‌

1 రోజు క్రితం

england
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 09:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 2-1తో నార్వేపై గెలుపు

- ఫిఫా-2026 ప్రపంచకప్‌

మయామి (యుఎస్‌ఎ) : 1966 తర్వాత తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ ‌ఫైనల్లోకి అడుగుపెట్టేందుకు ఇంగ్లాండ్‌ ఇంకో అడుగు దూరంలో నిలిచింది. మయామి స్టేడియంలో జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో నార్వేపై ఇంగ్లాండ్‌ 2-1తో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌ ‌సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నార్వేకు అండ్రీయస్‌ ‌ఏకైక గోల్‌ అందించగా.. ఇంగ్లాండ్‌‌కు జూడ్‌ ‌బెల్లింగ్‌‌హామ్‌ ‌రెండు గోల్స్‌‌తో విజయాన్ని కట్టబెట్టాడు. ఫైనల్లో చోటు కోసం డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ అర్జెంటీనాతో ఇంగ్లాండ్‌ ‌తలపడనుంది.

బెల్లింగ్‌‌హామ్‌ ‌జోరు

క్వార్టర్‌‌ఫైనల్లో హ్యారీకేన్‌‌పై ఇంగ్లాండ్‌.. హాలాండ్‌‌పై నార్వే బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాయి. కానీ ఇరు జట్లకు ఈ ఇద్దరూ గోల్‌ ‌కొట్టలేదు. సహచరులకు గోల్‌ అవకాశాలు సృష్టించలేదు. ఇంగ్లాండ్‌ ‌దూకుడుగా ఆడినా... మ్యాచ్‌‌లో నార్వే తొలుత ఆధిక్యంలో నిలిచింది. మార్టిన్‌ అందించిన పాస్‌‌ను ఆండ్రియస్‌ ‌గోల్‌‌గా మలిచాడు. దీంతో 36వ నిమిషంలో నార్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. స్కోరు సమం చేసేందుకు ఇంగ్లాండ్‌ ఎక్కువ సమయం తీసుకోలేదు. ప్రథమార్థం ఇంజూరీ టైమ్‌‌లో ఆంటోని గోర్డాన్‌ ‌పాస్‌‌తో జూడ్‌ ‌బెల్లింగ్‌‌హామ్‌ ‌గోల్‌ ‌కొట్టాడు. ప్రథమార్థం 1-1తో సమవుజ్జీల సమరంగా ముగిసింది. ద్వితీయార్థంలో ఇరు జట్ల నుంచి మరో గోల్‌ ‌నమోదు కాలేదు. దీంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారితీసింది. 93వ నిమిషంలో జూడ్‌ ‌బెల్లింగ్‌‌హామ్‌ ‌మరో మెరుపు గోల్‌ సాధించాడు. ఇంగ్లాండ్‌‌ను 2-1తో ముందంజలో నిలిపాడు. బంతిపై నియంత్రణతో పాటు ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసిన ఇంగ్లాండ్‌.. నార్వే నుంచి గోల్‌‌పోస్ట్‌‌ను డిఫెండ్‌ ‌చేసుకుంది. క్వార్టర్‌‌ఫైనల్లో నార్వేను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్