ఆగస్టు 15 నాటికి 100 నగరాల్లో లభ్యం
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్)తన 10 కిలోల తేలికపాటి ఎల్‌పిజి సిలిండర్ల సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఆగస్టు 15 నాటికి 24 రాష్ట్రాల్లోని 100 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాల అనంతరం వెల్లడించింది. ఇటీవల భారత్ గ్యాస్ లైట్ జిప్ పేరుతో ప్రీమియం ఎల్‌పిజి సేవలను ప్రారంభించింది. ఈ సేవలో భాగంగా తక్కువ బరువు, తుప్పు పట్టని 10 కిలోల సిలిండర్లను అందిస్తోంది. కొత్త కనెక్షన్‌ను తక్షణమే మంజూరు చేయడంతో పాటు గ్యాస్‌ను వేగంగా ఇంటికే చేరవేసే ఎక్స్‌ప్రెస్ డెలివరీ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఇదే తరహాలో హెచ్‌పిసిఎల్ కూడా ఇటీవల నవ్య పేరిట 10 కేజీల సిలిండర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బిపిసిఎల్ రూ.3,962.13 కోట్ల నికర నష్టాలను చవి చూసింది. గత 15 త్రైమాసికాల తర్వాత కంపెనీ నష్టాల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. గతేడాది ఇదే కాలంలో రూ.6,124 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.








కామెంట్‌లు (0)