న్యూఢిల్లీ : దేశంలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలో నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) అక్రమాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.74,782 కోట్ల విలువైన నకిలీ ఐటిసి క్లెయిమ్‌లను గుర్తించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బుధవారం రాతపూర్వకంగా రాజ్యసభకు తెలిపారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.58,773 కోట్లతో పోల్చితే మోసాల్లో 27 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఇనుము, ఉక్కు, జౌళి, సిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాలలో ఈ మోసాలు వెలుగు చూశాయి. కృత్రిమ మేధ (ఎఐ), బిగ్ డేటా ఆధారిత ప్రాజెక్ట్ అద్వైత్ వంటి అధునాతన విశ్లేషణ టూల్స్ సహాయంతో దొడ్డిదారిన మళ్లుతున్న క్రెడిట్ ప్రవాహాలు, షెల్ కంపెనీలను సులభంగా గుర్తిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నారు.
Print Editionరూ.75 వేల కోట్లకు నకిలీ జిఎస్‌టి అక్రమాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)