* తెలుగు రాష్ట్రాల్లో రూ.1,43,580కి చేరిన 24 క్యారెట్ల తులం బంగారం
* కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,40,100కి చేరిక
వెబ్‌డెస్క్ :
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గురువారం రోజు ఉదయం వెల్లడైన ధరల ప్రకారం... విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,580 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులం రూ.1,31,610గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలలో బంగారం ధరలు ఒకే రీతిలో కొనసాగుతున్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,43,580, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,610 కాగా, 18 క్యారెట్ల బంగారం రూ.1,07,680 చొప్పున విక్రయించబడుతోంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరలు ఇంచుమించు ఇదే స్థాయిలో ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,790గా ఉండగా, న్యూఢిల్లీలో రూ.1,43,730గా నమోదైంది. ఇక ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే ధర రూ.1,43,580 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధర విషయానికొస్తే, కిలోపై రూ.100 మేర స్వల్పంగా తగ్గి రూ.2,40,100కి చేరింది. అయితే, మార్కెట్‌లోని ఈ ధరలు కేవలం సూచిక మాత్రమేనని, కొనుగోలు సమయంలో స్థానిక పన్నులు, తయారీ ఛార్జీల (మేకింగ్ ఛార్జీలు) కారణంగా తుది ధరలో మార్పులు ఉండవచ్చని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.








కామెంట్‌లు (0)