బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionత్వరలో ఐడిబిఐ బ్యాంకు విదేశీ పరం..!

1 గంట క్రితం

idbi bank
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 10:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తుది దశకు విక్రయ ప్రక్రియ

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంకు విదేశీ పరం కానుంది. కెనడాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎన్‌బిడిలు తాజాగా సవరించిన ఆర్థిక బిడ్లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐడిబిఐలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసికి 94.72 శాతం వాటాలు ఉండగా.. ఇందులో 60.72 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమవుతున్నాయి. సవరించిన బిడ్లను ఉన్నతస్థాయి కమిటీలు పరిశీలిస్తున్నాయి. మొదట నాలుగు సంస్థలు ఆసక్తి చూపినప్పటికీ.. తుది దశలో విదేశీ సంస్థలైన ఫెయిర్‌ఫ్యాక్స్, ఎమిరేట్స్ ఎన్‌బిడి మాత్రమే పోటీలో నిలిచాయి. దీంతో దేశీయ బ్యాంకింగ్ రంగంలో కీలకమైన ఐడిబిఐ బ్యాంకు యాజమాన్యం విదేశీ పెట్టుబడిదారుల చేతికి వెళ్లే అవకాశం మెండుగా ఉంది. బిడ్ల పరిశీలన అనంతరం విజేతను ప్రకటించే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్