న్యూఢిల్లీ :నమాజ్ ప్రార్థనలు నిర్వహించుకోవడం కోసం భోజ్‌శాల-కమల్ మౌలా కాంప్లెక్స్‌కు ఆనుకొని లేదా సమీపంలో ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం దురదృష్టకరమని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బుధవారం ఒక పోస్టు చేశారు. దీనికి బదులుగా సుప్రీంకోర్టు భోజ్‌శాల-కమల్ మౌలా కాంప్లెక్స్‌లో యథాతథ స్థితిని పునరుద్ధరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ఉండాల్సిందని బేబీ పేర్కొన్నారు. భోజ్‌శాల-కమల్ మౌలా కాంప్లెక్స్‌ను దేవాలయంగా ప్రకటించి, అక్కడ నమాజ్‌ను నిషేధిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. చారిత్రక మతపరమైన వివాదాలను మళ్లీ తెరపైకి తెస్తూ, తద్వారా గణతంత్ర లౌకిక పునాదులకు ముప్పు కలిగిస్తున్న ఆందోళనకరమైన ధోరణిలో భోజ్‌శాల-కమల్ మౌలా కేసు కూడా ఒక భాగమని ఎంఎ బేబీ విమర్శించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించేటప్పుడు రాజ్యాంగ విలువలను, 1991 ప్రార్థనా స్థలాల చట్టంలోని నిబంధనలను సమర్థించాలని బేబీ తన పోస్టులో పేర్కొన్నారు.
Print Editionసుప్రీం ఆదేశాలు దురదృష్టకరం :ఎంఎ బేబీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 11:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)