సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌‌కు రెండంకెల వృద్ధి కావాలి

1 గంట క్రితం

rupee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 09:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- లేకపోతే వికసిత్ భారత్ లక్ష్యానికి గండి..!

- బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్‌

‌న్యూఢిల్లీ : ప్రపంచానికి భారత్‌‌ను ప్రధాన తయారీ హబ్‌గా మార్చాలనే లక్ష్యానికి పలు తీవ్రమైన ప్రతికూలాంశాలు అడ్డుగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బిఒఎఫ్‌ఎ) తెలిపింది. వ్యవసాయ రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తిని మెరుగైన వేతనాలు లభించే రంగాల వైపు మళ్లించడంలో తయారీ రంగం కీలకపాత్ర పోషించాల్సి ఉందని పేర్కొంది. అయితే దేశంలో వనరులు, శ్రామిక శక్తి పుష్కలంగా ఉన్నప్పటికీ జిడిపిలో తయారీ రంగం వాటా సుమారు 17 శాతం వద్దే నిలకడగా ఉండిపోయిందని బిఒఎఫ్‌ఎ తన రిపోర్ట్‌‌లో పేర్కొంది. రాబోయే 15 ఏళ్లలో ఈ రంగాన్ని బలోపేతం చేయాలంటే ఏటా కనీసం 10 శాతం వృద్ధిని నమోదు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే ​ఈ మందగమనానికి ప్రధాన కారణాలను విశ్లేషించింది. భారత్‌లో దాదాపు 9.2 కోట్ల సూక్ష్మ సంస్థలు ఉండగా, కేవలం 40,000 మధ్యతరహా సంస్థలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఈ అసమతుల్యత ఉత్పాదకతను, నాణ్యమైన ఉద్యోగాల సృష్టిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా తయారీ రంగానికి చెందిన ఎంఎస్‌ఎంఇలు ఏటా దాదాపు 1,400 నిబంధనలను పాటించాల్సి వస్తుండటం చిన్న సంస్థల విస్తరణకు పెనుభారంగా మారుతోందని తెలిపింది. మరోవైపు పారిశ్రామిక వినియోగదారులు ఎదుర్కొంటున్న అధిక విద్యుత్ ఖర్చులు కూడా తయారీ రంగానికి మరో ప్రధాన అవరోధంగా మారాయి. అధిక విద్యుత్ ధరలు, సంక్లిష్టమైన నియంత్రణ విధానాల కారణంగానే దేశ పారిశ్రామిక రంగానికి ఆశించిన స్థాయిలో రెండంకెల వృద్ధి సాధ్యపడటం లేదని తెలిపింది. ఇవి ఇలాగే కొనసాగితే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ‘వికసిత్ భారత్’ ఆశయ సాధనపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్