వాణిజ్య శాఖ కార్యదర్శి వెల్లడి
న్యూఢిల్లీ: భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ) చర్చలు దాదాపు పూర్తయ్యాయని.. ఒప్పందంలోని అన్ని అంశాలపై ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చినట్లు వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ వెల్లడించారు. అయితే అమెరికా సుప్రీంకోర్టు గతంలో విధించిన పరస్పర సుంకాలను రద్దు చేయడంతో అక్కడ కొత్త సుంకాల విధానాన్ని రూపొందిస్తున్నారని తెలిపారు. అది ఖరారయ్యే వరకు ఒప్పందంపై సంతకాలు ఆలస్యం కావచ్చన్నారు. చర్చల ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరిలో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ప్రకారం.. ఒప్పంద పరిధిలోని భారతీయ వస్తువులపై 18 శాతం పరస్పర సుంకం విధించాలని అమెరికా నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన సుంకాలను రద్దు చేసింది. దీంతో అమెరికా కొత్త సుంకాల విధానాన్ని రూపొందిస్తోంది.








కామెంట్‌లు (0)