ప్రజాశక్తి - హైదరాబాద్: వంటగదుల కోసం వి-రిచ్ హైదరాబాద్ మార్కెట్లోకి ‘ఇన్‌స్టంట్ తడ్కా ఘీ’ను విడుదల చేసింది. ఏ2 ఆవు నెయ్యి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు వంటి ఏడు రకాల వేయించిన దినుసులతో దీన్ని తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. 250 మి.లీ జార్ ధర రూ.449గా నిర్ణయించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, హైదరాబాద్‌లో బ్లింకిట్ ద్వారా ఉత్పత్తి అందుబాటులో ఉంటుందని వి-రిచ్ వ్యవస్థాపకురాలు, సీఈఓ యోగితా జాహ్నవి తెలిపారు. బిజీ జీవితంలోనూ సాంప్రదాయ రుచులను సులభంగా అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ తడ్కా ఘీ ద్వారా వంట సమయంలో పోపు పెట్టే శ్రమ తప్పుతుందని, క్షణాల్లో సాంప్రదాయ రుచిని పొందవచ్చన్నారు.
వి-రిచ్ నుంచి ఇన్‌స్టంట్ తడ్కా ఘీ విడుదల
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 10:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)