సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవడ్డీ రేట్లు పెరగొచ్చు : హెచ్‌ఎస్‌‌బిసి

6 గంటల క్రితం

Interest rates may rise: HSBC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణ ఒత్తిడి కొనసాగుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌‌బిఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ హెచ్‌ఎస్‌‌బిసి వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బిఐ రెపో రేటును రెండుసార్లు.. మొత్తం 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. గడిచిన రెండో త్రైమాసికంలో ఆర్‌బిఐ అంచనా వేసిన 7 శాతం కంటే జిడిపి ఎక్కువగా నమోదైందని, ఇది క్రమంగా వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని హెచ్‌ఎస్‌బిసి పేర్కొంది. రాబోయే మూడు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం సగటున 5 శాతానికి పైగా ఉండొచ్చని ఆర్‌‌బిఐ భావిస్తున్న తరుణంలో వడ్డీ రేట్లను పెంచేందుకు అవకాశాలున్నాయని, దీనివల్ల రెపో రేటు 5.75 శాతానికి చేరొచ్చని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్