ముంబయి : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఒబి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 49.3 శాతం వృద్ధితో రూ.1,659 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,111 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం కూడా రూ.8,866.47 కోట్ల నుంచి రూ.10,938 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. స్థూల మొండి బకాయిలు గతేడాది 1.97 శాతం నుంచి 1.33 శాతానికి తగ్గగా.. నికర మొండి బకాయిలు 0.32 శాతం నుంచి 0.18 శాతానికి పరిమితమయ్యాయి. దీంతో బ్యాంక్ బ్యాలెన్స్‌షీట్ మరింత బలోపేతమైందని ఆ బ్యాంక్ తెలిపింది.
ఐఒబికి రూ.1,659 కోట్ల లాభాలు
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 09:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)