మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్యాకేజింగ్‌ నీటి వ్యాపారంలోకి ఐఒసి

5 గంటల క్రితం

image-cmumsu76v213d0js0c7p792j1.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 10:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 43,000 పైగా అవుట్లెట్లలో విక్రయం..!

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) కొత్త వ్యాపారాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ఇంధనేతర ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా సొంత బ్రాండ్‌తో ప్యాకేజింగ్‌ తాగునీటిని మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 43,000లకు పైగా పెట్రోల్ బంకులు ద్వారా తొలుత ఈ మంచినీటి బాటిళ్లను విక్రయించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ​ఈ తాగునీటి విక్రయాల ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు సంస్థ ఆదాయాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చని యాజమాన్యం అంచనా వేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్