శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బడ్జెట్‌ ధరలో ఐటెల్ ‘జెనో 100 ప్రో’ స్మార్ట్‌ఫోన్

14 గంటల క్రితం

editedimage
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 11:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : బడ్జెట్ ధరలో మొబైల్స్ కొనుగోలు చేసే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ టెక్ బ్రాండ్ ఐటెల్ (Itel) భారత్ మార్కెట్లోకి కొత్తగా ఐటెల్‌ ‌జెనో 100 ప్రో స్మార్ట్‌‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రత్యేకించి తొలిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారు, విద్యార్థులు, తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు కోరుకునే వారి కోసం ఈ ఫోన్‌ను రూపొందించారు. ​ఈ స్మార్ట్‌ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ యూనిసోక్ టి7100 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ ఫోన్‌లో 3 జిబి రామ్, 64 జిబి అంతర్గత స్టోరేజ్ సౌకర్యం ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకునే అవకాశం కల్పించారు. ఫోన్ వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే, రోజంతా నిలిచే శక్తివంతమైన 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.​ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ మన్నికను కలిగి ఉండటం దీని ప్రత్యేకత. భారత్‌లో దీని ప్రారంభ ధరను రూ.8,599గా నిర్ణయించింది.

ముఖ్య ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.6 అంగుళాల HD+ టచ్‌స్క్రీన్
ప్రాసెసర్: ఆక్టా-కోర్ Unisoc T7100
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 (Go Edition)
ర్యామ్: 3GB
స్టోరేజ్: 64GB
రియర్ కెమెరా: 8MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 5,000mAh
కనెక్టివిటీ: Wi-Fi, GPS, USB Type-C

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్