శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫెడరల్‌ బ్యాంక్‌ చేతికి జన ఎస్‌ఎఫ్‌‌బి..

5 గంటల క్రితం

sfd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : దేశీయ ప్రయివేటు బ్యాంకింగ్‌ రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమవుతోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు కేరళలోని అలువా కేంద్రంగా ఉన్న ఫెడరల్‌ బ్యాంక్‌ తుది దశ చర్చలు జరుపుతోన్నట్లు రిపోర్టులు వస్తోన్నాయి. ఈక్విటీ షేర్ల మార్పిడి పద్ధతిలో జరగనున్న ఈ ఒప్పందంలో భాగంగా ఫెడరల్‌ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.82,000 కోట్లు కాగా, జన ఎస్‌ఎఫ్‌బి విలువ రూ.5,600 కోట్లుగా ఉంది. ఈ కొనుగోలు పూర్తయితే జన ఎస్‌ఎఫ్‌బి స్వతంత్ర బ్యాంకుగా ఉనికి కోల్పోయి, దాని ఆస్తులు, రుణాలు ఫెడరల్‌ బ్యాంక్‌లో విలీనమవుతాయి. తద్వారా ఫెడరల్‌ బ్యాంక్‌ తన మైక్రోఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోవాలని భావిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్