సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

యుకె ఎఫ్‌‌టిఎతో లగ్జరీ కార్లు చౌక

11 జులై, 2026

uts
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 10:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రూ.1–3 కోట్ల వరకు ధర తగ్గే అవకాశం

న్యూఢిల్లీ : భారత్‌-బ్రిటన్‌ ‌మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌‌టిఎ) జులై 15 నుంచి అమల్లోకి రానుంది. దీంతో బ్రిటన్‌లో తయారైన ప్రీమియం కార్లు భారత మార్కెట్లో భారీగా చౌక కానున్నాయి. ప్రస్తుతం పూర్తిగా దిగుమతి అయ్యే కార్లపై ఉన్న 110 శాతం కస్టమ్స్ సుంకాన్ని తొలి ఏడాదిలో 20 వేల కార్ల కోటాకు 30 శాతానికి సుంకాలను తగ్గించనున్నారు. దీంతో రోల్స్ రాయిస్, ఆస్టన్ మార్టిన్, మెక్‌లారెన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి లగ్జరీ బ్రాండ్ల కార్ల ధరలు 20–25 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోడల్‌ను బట్టి ఒక్కో కారుపై రూ.1 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు సంపన్నులకు ఆదా కావచ్చని పేర్కొంటున్నాయి. ఈ ధరల తగ్గింపుతో బ్రిటన్‌ ‌లగ్జరీ కార్లు భారత మార్కెట్లలో భారీగా పెరగనున్నాయి. మొత్తం విక్రయాల్లో దిగుమతి కార్ల వాటా ప్రస్తుతం ఉన్న 3–4 శాతం నుంచి 7–10 శాతానికి పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్