మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌

1 గంట క్రితం

stocks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. నాలుగు రోజుల వరుస లాభాల తర్వాత అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు, మెటల్, రియాల్టీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 104.35 పాయింట్లు తగ్గి 78,181కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 24,398.70 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం కూడా సూచీలపై ప్రభావం చూపింది. హెచ్‌సిఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లు లాభపడగా, ట్రెంట్‌, అదానీ పోర్ట్స్, రిలయన్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 94.94గా ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 72.74 డాలర్లుగా నమోదయ్యింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్