శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడో రోజూ మార్కెట్ల జోరు

03 జులై, 2026

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 09:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఐటి, రియాల్టీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సెషన్‌‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 262 పాయింట్లు పుంజుకుని 77,764 వద్ద ముగిసింది. నిఫ్టీ 95.15 పాయింట్ల లాభంతో 24,271 వద్ద నమోదయ్యింది. సెన్సెక్స్‌30‌లో హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బిఐ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 95.22గా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71 డాలర్లుగా, బంగారం ఔన్సు ధర 4,179 డాలర్లుగా నమోదయ్యింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్