సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మారుతి సుజుకి కార్ల ధరల పెంపు..

1 గంట క్రితం

sud
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రూ. 20,000 వరకు భారం!

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మరోమారు వాహన ధరలను పెంచింది. ముడిసరుకుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ భారం అధికంగా ఉండటంతో సెప్టెంబర్ నెల నుంచి ఎంపిక చేసిన కార్ల మోడళ్ల ధరలను రూ. 20,000 వరకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. మే నెల తర్వాత మారుతి సుజుకి ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ​గత నెలలో కంపెనీ తన వాహనాలపై దాదాపు రూ.30,000 వరకు ధరలను సవరించింది. అయితే ఈ సారి మాత్రం మొత్తం పోర్ట్‌ఫోలియోపై కాకుండా కేవలం కొన్ని ప్రత్యేక మోడళ్లపై మాత్రమే ఈ పెంపు వర్తించనుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరఫరా గొలుసులో వ్యత్యాసాలు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను అధిగమించడానికి ఖర్చును తగ్గించే చర్యలు చేపట్టినప్పటికీ.. భారాన్ని కొంతవరకు మార్కెట్‌కు బదలాయించక తప్పడం లేదని మారుతి సుజుకి వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్