బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎంఇఐఎల్‌ విలువ @ లక్ష కోట్లు

2 గంటల క్రితం

image-cmwm7dphqh34q0js066kz5lhk.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 09:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రూ.5,800 కోట్లు సమీకరణ..!

ప్రజాశక్తి - బిజినెస్‌ ‌బ్యూరో​ : మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) గ్రూప్‌ విలువ సుమారు రూ.లక్ష కోట్లకు చేరింది.

అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు డికె, హెచ్‌హెచ్‌, వర్డే పార్ట్‌నర్స్‌ భాగస్వామ్యంతో సుమారు 700 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5,800 కోట్లు) సమీకరించేందుకు ఒప్పందం కుదిరింది. పివి క్రిష్ణారెడ్డి సిఎండిగా ఉన్న ఈ సంస్థ రహదారి ప్రాజెక్టుల ఆస్తుల నగదీకరణ, నిర్మాణాత్మక ఈక్విటీ పెట్టుబడుల ద్వారా ఈ నిధుల సమీకరణ చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గ్రూపులోని ఇంధన పరివర్తన సంస్థ ఇపిటిఎల్‌ విలువను సుమారు రూ.14 వేల కోట్లుగా అంచనా వేశారు. గత మూడు దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఇఐఎల్‌ ప్రస్తుతం 20కి పైగా దేశాల్లో ప్రాజెక్టులను చేపడుతోంది. నీటిపారుదల, రహదారులు, విద్యుత్‌, చమురు-వాయువు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్‌ వాహనాలు వంటి రంగాల్లో విస్తరించింది. జోజిలా సొరంగం, ముంబయి కోస్టల్‌ రోడ్‌, పోలవరం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్న సంస్థకు 1,975 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టులున్నాయి. 9,110 మెగావాట్లకు పైగా పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు, 3,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. కైగా అణు విద్యుత్‌ ప్రాజెక్టులు, మంగోలియా చమురు శుద్ధి కర్మాగారంతో పాటు విద్యుత్‌ బస్సులు, గ్యాస్‌ పంపిణీ రంగాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్