మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆటోమోటివ్ విడిభాగాల మార్కెట్లోకి ఎన్‌బిసి బేరింగ్స్

1 గంట క్రితం

nbc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఎన్‌బిసి బేరింగ్స్ కొత్త ఆటోమోటివ్ ఆఫ్టర్‌మార్కెట్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల కోసం వైపర్ బ్లేడ్లు, బ్రేక్ ప్యాడ్లు, బెల్టులు, స్టీరింగ్ రాడ్ల వంటి విడిభాగాలను దేశవ్యాప్త పంపిణీ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. బేరింగ్స్ తయారీలో ఉన్న నైపుణ్యంతో పాటు, మారుతున్న వాహనాల అవసరాలకు అనుగుణంగా వైవిధ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని సంస్థ సిఇఒ రోహిత్ సాబూ పేర్కొన్నారు.

జనరాలి సెంట్రల్ లైఫ్ నుంచి సునేహ్రా పింఛన్

బెంగళూరు : పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రత కోసం జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కొత్తగా సునేహ్రా పింఛన్ పథకాన్ని ఆవిష్కరించింది. పొదుపుతో పాటు ఉచిత ఆరోగ్య సేవలను కూడా అందించే ఈ పథకం, పెరుగుతున్న వయోధికుల జనాభాకు, దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిందని ఆ సంస్థ పేర్కొంది. క్రమశిక్షణతో కూడిన పదవీ విరమణ నిధిని నిర్మించుకోవాలనుకునే వారికి ఇది ఒక పటిష్టమైన సాధనమని, వినియోగదారులకు భద్రతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తామని సంస్థ ఎండి అలోక్ రుంగ్తా తెలిపారు.

కలుపు నివారణకు గోద్రేజ్ హిట్‌వీడ్ మ్యాక్స్

హైదరాబాద్‌ : తెలంగాణలో వాతావరణ మార్పుల వల్ల పత్తి పంటలో పెరుగుతున్న కలుపు సమస్యను నివారించేందుకు గోద్రేజ్ ఆగ్రోవెట్ హిట్‌వీడ్ మ్యాక్స్ ను విడుదల చేసింది. 2-3 ఆకుల దశలో ఉన్న కలుపును సమర్థంగా నివారించే ఈ కలుపు నాశిని, పంట ఎదుగుదలకు అవసరమైన పోషకాలను కాపాడుతుందని సంస్థ తెలిపింది. సకాలంలో శాస్త్రీయ పద్ధతిలో కలుపు నివారణ ద్వారా దిగుబడి పెంచుకోవాలని.. ఇందుకోసం రైతులకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా కల్పిస్తున్నామని కంపెనీ సిఇఒ రాజవేలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్