- 13 శాతం లాభాల్లో స్మాల్‌క్యాప్స్!
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ-50 నష్టాల్లో కొనసాగుతుండగా.. స్మాల్‌క్యాప్ షేర్లు మాత్రం భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. 2026లో ఇప్పటివరకు నిఫ్టీ-50 దాదాపు 7 శాతం క్షీణించగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్-100 సూచీ సుమారు 13 శాతం లాభపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, స్మాల్‌క్యాప్ విభాగం మాత్రం బలంగా నిలిచింది. రానున్న కాలంలో విద్యుత్ రంగానికి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏరోస్పేస్, రక్షణ, ఆటో అనుబంధ పరిశ్రమల కంపెనీల్లోనూ దీర్ఘకాలిక అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఇంధన ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలకంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమ వడం, ఇరాన్‌పై అమెరికా కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడం, యుద్ధ వాతావరణం నెలకొనడంతో పశ్చిమాసియా పరిణామాలు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో బిఎస్‌ఇ సెన్సెక్స్ 171.72 పాయింట్లు కోల్పోయి 77,369.11 వద్ద, నిఫ్టీ 32.95 పాయింట్లు నష్టపోయి 24,219.05 కు పరిమితమయ్యాయి. అదానీ పోర్ట్స్, బిఇఎల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోగా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి.








కామెంట్‌లు (0)