హైదరాబాద్ : ప్రభుత్వ రంగ ఇనుప ఖనిజ దిగ్గజం ఎన్‌ఎండిసి లంప్ ఓర్ ధరను టన్నుకు రూ.150 మేర పెంచింది. ముడి ఇనుప ఖనిజంలో పెద్ద ముక్కలను లంప్ ఓర్ కొత్త ధరలు సెప్టెంబర్ 9 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ సవరణతో టన్ను లంప్ ఓర్ ధర రూ.5,400కి చేరింది. గడిచిన రెండు నెలలుగా వరుసగా ధరలు తగ్గిస్తూ వచ్చిన కంపెనీ.. తాజాగా ఈ ధరల సవరణ చేపట్టింది. కాగా టన్ను ఫైన్స్ ధరను మాత్రం రూ.4,500 వద్దే ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు ఎఫ్‌ఓఆర్ ప్రాతిపదికన వర్తిస్తాయని, రాయల్టీ, జిఎస్‌టి, ఇతర పన్నులు దీనికి అదనంగా ఉంటాయని పేర్కొంది.
ఎన్‌ఎండిసి ముడి ఇనుప ఖనిజం ధర పెంపు..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 10:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)