గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమార్కెట్లకు చమురు సెగ

2 రోజుల క్రితం

crude-oil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 10:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సెన్సెక్స్‌ 560 పాయింట్ల పతనం

ముంబయి : పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు చమురు ధరలకు ఆజ్యం పోయడంతో దలాల్‌ స్ర్టీట్‌లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవి చూశాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో ఆటో, ఫైనాన్షియల్, ఐటి రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగి సెన్సెక్స్ 561.46 పాయింట్లు కోల్పోయి 77,054.94కు పరిమితమయ్యింది. నిఫ్టీ 158.95 పాయింట్లు నష్టపోయి 24,052.05 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజులోనే బిఎస్‌ఇలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.3 లక్షల కోట్లు హరించుకుపోయింది.

​ ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి. చమురు సరఫరాపై ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 87 డాలర్లకు చేరగా.. భారత్‌తో పాటు అమెరికాలోనూ వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేశాయి. దీనికి తోడు హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ నిరాశపరిచిన ఫలితాలు, రూపాయి బలహీనపడటంతో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాల వైపు మొగ్గుచూపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్