బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మహానది బేసిన్‌లో ఒఎన్‌‌జిసి తవ్వకాలు షురూ..

4 రోజుల క్రితం

mahanadi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 08:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఒఎన్‌‌జిసి ‘సముద్ర మథన్’ మిషన్‌లో భాగంగా ఒడిస్సా తీరంలోని మహానది ఆఫ్‌షోర్ బేసిన్ లో తొలి డీప్‌వాటర్ అన్వేషణ బావి తవ్వకాలను ప్రారంభించింది. కోణార్క్ ప్రాంతానికి సుమారు 23 నాటికల్ మైళ్ల దూరంలో ఈ బావిని తవ్వుతున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశంలోని లోతైన, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజవాయు నిల్వలను గుర్తించి దేశీయ ఉత్పత్తిని పెంచడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపింది. భారత్‌ చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి ఇంధన భద్రతను బలోపేతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ డీప్‌వాటర్ అన్వేషణ చేపట్టినట్లు ఒఎన్‌‌జిసి పేర్కొంది. దేశ తూర్పు, పశ్చిమ సముద్ర ప్రాంతాల్లో 5,600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు సమాన హైడ్రోకార్బన్ నిల్వలు ఉండే అవకాశం ఉందని అంచనా. మహానది, కావేరి, అండమాన్ బేసిన్‌లలో ఇటీవల లభించిన విజయాలు ఆఫ్‌షోర్ అన్వేషణకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయని ఒఎన్‌‌జిసి వెల్లడించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్