- మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల
వాషింగ్టన్ : మానవ ఉద్యోగాలను ఎఐ భర్తీ చేస్తుందనే భయాలు పెరుగుతుండటంతో ప్రజలు కృత్రిమ మేధ (ఎఐ) పరిశ్రమపై విశ్వాసం కోల్పోతున్నారని మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే ఎఐ వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను కంపెనీలు స్పష్టంగా వివరించాలని సూచించారు. ఉదాహరణకు ఒక సంస్థ డేటా సెంటర్‌ను నిర్మిస్తే అది స్థానిక ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ఎలా దోహదపడుతుందో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఎఐని మానవులకు ప్రత్యామ్నాయంగా కాకుండా వారి సామర్థ్యాలను పెంచే సాధనంగా చూడాలని నాదెళ్ల పేర్కొన్నారు. ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఎఐని ప్రవేశపెట్టడం కంటే ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడం, కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, మెరుగైన వేతనాలకు దోహదపడే విధంగా ఈ సాంకేతికతను వినియోగించాలని కంపెనీలకు సూచించారు. మానవుల సృజనాత్మకతకు ఎఐ తోడైతేనే భవిష్యత్ వ్యాపారాలు స్థిరమైన వృద్ధిని సాధించగలవని అభిప్రాయపడ్డారు.







కామెంట్‌లు (0)