మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ భళా..

2 రోజుల క్రితం

bank
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 09:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మూడు రెట్లు పెరిగిన లాభాలు

- క్యూ1లో రూ.5,253 కోట్లుగా నమోదు

ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంక్‌ (పిఎన్‌‌బి) అద్భుతమైన పనితీరును కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో మూడు రెట్ల వృద్ధితో రూ.5,253 కోట్ల నికర లాభాలు సాధించింది. మొండి బాకీలు తగ్గడంతో లాభాలు పెరిగాయి. కాగా.. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1,675 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గడిచిన క్యూ1లో మొత్తం ఆదాయం యథాతథంగా రూ. 37,231 కోట్లుగా నమోదయ్యింది. కాగా.. నికర వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.32,897 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.31,964 కోట్లుగా ఉంది. మొండి బాకీలను తగ్గించుకోవడంలో మంచి పురోగతిని సాధించింది. 2026 జూన్ త్రైమాసికం ముగింపు నాటికి స్థూల మొండి బకాయిల నిష్పత్తి ఏడాది క్రితం ఉన్న 3.78 శాతం నుంచి 2.78 శాతానికి తగ్గింది. విలువ పరంగా చూస్తే స్థూల ఎన్‌‌పిఎలు రూ.42,673 కోట్ల నుంచి రూ. 35,381 కోట్లకు తగ్గాయి. అదే విధంగా నికర మొండి బకాయిల నిష్పత్తి 0.38 శాతం నుంచి 0.26 శాతానికి మెరుగుపడింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్