బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

0.25శాతం పెరిగిన వడ్డీ రేటు

17 గంటల క్రితం

RBI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 11:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ ) వడ్డీరేట్లను 0.25శాతం పెంచింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు మేర అంటే 5.25శాతం నుండి 5.50శాతానికి పెంచాలని తమ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు బుధవారం ప్రకటించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతుండటంతో సుమారు మూడున్నరేళ్ల అనంతరం కీలకమైన వడ్డీరేట్ల పెంపు చోటు చేసుకుంది. రెపోరేటును పెంచాలని ద్రవ్యవిధాన కమిటీ ( ఎంపిసి)లోని ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. దీంతో ఇప్పటివరకు ఉన్న ‘తటస్థ’ ద్రవ్య విధాన వైఖరిని ‘క్రమబద్ధమైన కఠినతరం’ (క్యాలిబ్రేటెడ్‌ టైటనింగ్‌)గా మార్చింది. ద్రవ్యోల్బణం పరిస్థితి ఇకపై అనుకూలంగా లేదని ఆర్‌బిఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపై అంచనాలు మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్