ముంబయి : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎఫ్‌ఎంసిజి విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సిఎఫ్‌ఎల్) ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇందుకోసం ‘బాంబే క్రీమరీ’ బ్రాండ్‌ను ఆవిష్కరించినట్లు మంగళవారం ఆవిష్కరించింది. డెయిరీ క్రీమ్‌తో తయారుచేసే ఈ ఐస్‌క్రీమ్‌లను కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ రూపంలో రూ. 10 ప్రారంభ ధరతో తొలుత పశ్చిమ రాష్ట్రాల్లో, క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. అందుబాటు ధరలో బాంబే క్రీమరీ ద్వారా అసలైన ఐస్‌క్రీమ్ రుచిని భారతీయులకు అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ టి. కృష్ణ కుమార్ తెలిపారు.
Print Editionఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్ ప్రవేశం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 10:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)