శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరెపో రేటు మరొక్క శాతం పెరగొచ్చు

8 గంటల క్రితం

రెపో రేటు మరొక్క శాతం పెరగొచ్చు
డిసెంబరులో భారీ పెంపు
ఎస్‌‌బిఐ క్యాప్స్‌ అంచనా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డిసెంబరులో భారీ పెంపు

  • ఎస్‌‌బిఐ క్యాప్స్‌ అంచనా

న్యూఢిల్లీ: రుణగ్రహీతలపై వడ్డీ భారం మరింత పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రిజర్వ్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌‌బిఐ) కీలక వడ్డీ రేట్లను మరో 75 నుంచి 100 బేసిస్ పాయింట్ల (0.75-1 శాతం) మేర పెంచవచ్చని ఎస్‌‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్ (ఎస్‌‌బిఐ క్యాప్స్‌) అంచనా వేసింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో ద్రవ్యోల్బణం హెచ్చుగా ఉండొచ్చని.. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 2026లో భారీ పెంపు చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని తాజా నివేదికలో పేర్కొంది. ఇప్పటికే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్‌‌బిఐ తన విధాన వైఖరిని తటస్థం నుంచి రిస్క్‌‌కు మార్చింది. దీంతో సమీప భవిష్యత్తులో రుణ వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆశలకు గండి పడ్డాయి.

​ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 మూడో త్రైమాసికంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరవచ్చని ఎస్‌‌బిఐ క్యాప్స్‌ అంచనా వేసింది. వచ్చే 2027-28 తొలి త్రైమాసికం తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 5 శాతం దిగువకు రావచ్చని.. అప్పుడు విధాన సమీక్షా, వడ్డీ రేట్లలో తగ్గుదల ఉండొచ్చని పేర్కొంది. అధిక రుణ వ్యయం, వడ్డీ రేట్లు, గ్రామీణ ప్రాంతాల్లో విశ్వాసం సన్నగిల్లడం, ఖరీఫ్‌ సాగులో మందగమనం కారణంగా 2026-27 ద్వితీయార్ధంలో వినియోగ డిమాండ్‌ తగ్గే ప్రమాదం ఉందని ఎస్‌‌బిఐ క్యాప్స్‌ హెచ్చరించింది.

​అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బ్యారెల్‌ ముడి చమురు ధర సుమారు 100 డాలర్ల స్థాయిలో కొనసాగడం ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతున్నాయని నివేదిక తెలిపింది. 2026లో ఇప్పటివరకు ప్రభుత్వ పదేళ్ల బాండ్లపై రాబడులు సుమారు 70 బేసిస్ పాయింట్లు పెరిగాయని పేర్కొంది. అధిక వడ్డీ రేట్లు సమీప కాలంలో బ్యాంకుల మార్జిన్లకు తోడ్పడవచ్చని.. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆహారేతర రంగాల రుణాల వృద్ధి మందగించే అవకాశముందని అంచనా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్