శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్ ఇంటర్నెట్

2 గంటల క్రితం

star link
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎలన్‌ మస్క్‌ వెల్లడి

న్యూఢిల్లీ : భారత్‌‌లోని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో తగినంత ఇంటర్నెట్ సేవలు అందని వారికి స్టార్‌లింక్ సహాయపడగలదని ఆ కంపనీ అధినేత ఎలన్‌ ‌మస్క్‌ ఎక్స్‌‌లో తెలిపారు. పట్టణాలతో పోలిస్తే ఇంకా వేలాది గ్రామాల్లో 4జి కవరేజీ లేని నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం స్టార్‌లింక్ గతంలో జెన్ 2 శాటిలైట్ నెట్‌వర్క్ నిమిత్తం దరఖాస్తు చేసుకోగా.. రేడియో ఫ్రీక్వెన్సీలు భారత నిబంధనలకు అనుగుణంగా లేవన్న కారణంతో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్‌ ఆథరైజేషన్ సెంటర్ దానిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఇఒ) కక్ష్యలో పరిభ్రమించే సుమారు 6,000 ఉపగ్రహాల ద్వారా తక్కువ లేటెన్సీతో కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు స్టార్‌లింక్ సిద్ధమవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్