జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ చెజియాన్ (57) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని శివగంగైలో జన్మించిన చెజియాన్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. సినిమాటోగ్రాఫర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 'రెట్టైసుళి', 'తెన్మెర్కు పరువకాట్రు', 'మగిళ్చి', 'పరదేశి', 'జోకర్' తదితర చిత్రాలకు పనిచేశారు. 'పరదేశి' చిత్రానికి గానూ 2013లో లండన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన 'టు లెట్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకుంది.
తమిళ దర్శకుడు చెజియాన్ కన్నుమూత
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 12:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)