బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మలచాలి

5 గంటల క్రితం

ai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 10:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిఐఐ సమ్మిట్‌‌లో సిఎస్‌ సంజయ్ జాజు

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : ‌ఏఐని కేవలం స్వీకరించడమే కాకుండా ప్రపంచ మార్కెట్ల కోసం నూతన ఉత్పత్తులు, ఐపీలను ఇక్కడే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌‌లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో ‘ప్రపంచానికి తెలంగాణ: గ్లోబల్ ఏఐ, జీసీసీ అందిపుచ్చుకోవడం’ అనే ఇతివృత్తంతో ఏఐ సమ్మిట్ 2026 ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. రూ.3.13 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 10 లక్షల మంది నిపుణులు, 515 జీసీసీలతో తెలంగాణ అగ్రపథంలో ఉందన్నారు. 2035 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోని టాప్ 20 ఏఐ హబ్‌లలో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ప్రభుత్వ, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ దిగ్గజాలు పాల్గొని ఎంటర్‌ప్రైజ్ ఏఐ, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు భవిష్యత్ వృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్