గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరుణాలపై వడ్డీ పోటు

1 రోజు క్రితం

రుణాలపై వడ్డీ పోటు
రెపోరేటును పెంచిన ఆర్‌‌బిఐ
హోమ్ లోన్ ఇఎంఐలు భారం
భవిష్యత్తులోనూ తగ్గింపు ఉండదు : గవర్నర్ సంజయ్ మల్హోత్రా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 01:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రెపో రేటును పెంచిన ఆర్‌‌బిఐ

ముంబయి : అదాయాలు పెరగక ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు మరింత భారం కానున్నాయి. కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతూ రిజర్వ్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌‌బిఐ) నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు సాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపిసి) భేటీలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. దీంతో గృహ, వాహన, రిటైల్‌ ‌తదితర రుణాలు భారం కానున్నాయి. 2023 ఫిబ్రవరి తర్వాత వడ్డీ రేటును పెంచడం ఇదే తొలిసారి. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్‌‌బిఐ వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆర్‌‌బిఐ గవర్నర్‌ సంజయ్‌ ‌మల్హోత్రా తెలిపారు. ఎంపిసి ముగింపు అనంతరం బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో అస్థిరత, అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థలపై ఒత్తిళ్లు, బలహీన రుతుపవనాల నేపథ్యంలో భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని మల్హోత్రా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపిసి తన విధాన వైఖరిని తటస్థం నుంచి కఠినతరం వైపు మార్చింద న్నారు. ఆరుగురు సభ్యుల కమిటీలో నలుగురు సభ్యులు ఈ మార్పునకు అనుకూలం గా ఓటు వేశారన్నారు. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశం లేదని గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును ఆర్‌‌బిఐ 5.25 శాతానికి సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) జిడిపి వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెంచింది. తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి చోటు చేసు కోగా.. రెండో త్రైమాసికంలో 7.2 శాతం, మూడో త్రైమాసికంలో 6.9 శాతం, నాలుగో త్రైమాసికంలో 6.8 శాతం వృద్ధి నమోదవు తుందని ఆర్‌‌బిఐ అంచనా వేసింది. 2027-28 తొలి త్రైమాసికంలో 7.1 శాతం వృద్ధి ఉండొ చ్చని పేర్కొంది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగానే కొనసాగుతున్నా యని మల్హోత్రా తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్