బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయూనియన్ బ్యాంక్‌ లాభాల్లో 30 శాతం వృద్ధి

1 గంట క్రితం

uino bank
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో బ్యాంకు నికర లాభం వార్షిక ప్రాతిపదికన 29.57 శాతం పెరిగి రూ.5,332 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,427.94 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ1లో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 10.15 శాతం పెరిగి రూ.10,037 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల (జిఎన్‌‌పిఎ) నిష్పత్తి 3.52 శాతం నుంచి 2.65 శాతానికి, నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 0.62 శాతం నుంచి 0.47 శాతానికి తగ్గింది. భవిష్యత్తులో కూడా నికర వడ్డీ ఆదాయాలను కాపాడుతూ లాభదాయక వృద్ధిని కొనసాగించడమే బ్యాంకు లక్ష్యమని యూనియన్‌ ‌బ్యాంక్‌ ఎండి, సిఇఒ ఆశీష్ పాండే తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్