బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుడిలో బాలికపై లైంగిక దాడి - నిందితుడి అరెస్టు

2 గంటల క్రితం

arrest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 09:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పుణె: మహారాష్ట్రలోని పుణెలో గుడికి వచ్చిన మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి విశాల్ సింగ్ అనే కాంట్రాక్ట్ కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. పింప్రి-చించ్‌వాడ్‌లోని నిగ్డి ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 10న ఉదయం 11.07 గంటల సమయంలో బాలిక గుడిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆమె చేయి పట్టుకుని లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. బాలిక అతడిని ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. గుడిలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. నిందితుడు మెట్రో నిర్మాణ పనుల్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. లైంగిక నేరాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలతో పాటు, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహేష్ బన్సోడే వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్