శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఐకెఎస్‌ నేత కమ్రుద్దీన్‌ కన్నుమూత

18 జులై, 2026

aiks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : అఖిల భారత కిసాన్‌ ‌సభ (ఎఐకెఎస్‌) ‌నేత కమ్రుద్దీన్‌ (68) కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల ఎఐకెఎస్‌ ‌తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగా అరుణ పతాకాన్ని అవనతం చేశారు. ఎఐకెఎస్‌ ‌సెంట్రల్‌ ‌కిసాన్‌‌ కౌన్సిల్‌ (ఎఐకెసి) సభ్యుడు, ఎఐకెఎస్‌ ఉత్తరాఖండ్‌ ‌మాజీ అధ్యక్షుడు, ఆర్థిక కార్యదర్శి అయిన కమ్రుద్దీన్‌ ‌డెహ్రాడూన్‌‌లో ప్రముఖ రైతాంగ ఉద్యమ నేత. రైతులు, వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడిన నిబద్ధత గల నేత. ఆయన అంకిత భావం, సమగ్రత, రైతాంగ ప్రయోజనాల పట్ల అచంచలమైన నిబద్ధత కారణంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, నేతలు ఆయనను అభిమానించేవారు. ఎఐకెఎస్‌ ఉత్తరాఖండ్‌ ఆర్థిక కార్యదర్శిగా రాష్ట్రంలో సంస్థను నిర్మించడంలో, బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. రైతు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, న్యాయం, గౌరవం, జీవనోపాధి కోసం రైతులు జరిపిన పోరాటాల్లో వారిని సమీకరించడానికి తన జీవితాంతం అవిశ్రాంతంగా కృషి చేశారని ఎఐకెఎస్‌ ‌పేర్కొంది. ఈమేరకు ఎఐకెఎస్‌ అధ్యక్ష కార్యదర్శులు అశోక్‌ ‌ధావలె, విజూ కృష్ణన్‌‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్